- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబు డేరా బాబా కంటే డేంజర్.. సంచలన వ్యాఖ్యలు చేసిన రోజా..
దిశ, ఏపీ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డేటా చౌర్యంకు సంబంధించి ప్రభుత్వం నియమించిన హౌస్ కమిటీ మంగళవారం మధ్యంతర నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. హౌస్ కమిటీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మధ్యంతర నివేదికను ప్రవేశపెట్టారు. ఈ అంశంపై రోజా చంద్రబాబుపై మండిపడ్డారు. దొంగ చంద్రబాబు..డేరా బాబా కంటే డేంజర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడుతూ... ప్రజాసాధికారత సర్వే పేరుతో ప్రజల డేటాను సేవామిత్ర ద్వారా టీడీపీ నాయకులకు విలువైన సమాచారం అందించారని రోజా ఆరోపించారు.
డేటా చౌర్యం చేయాలనే ఉద్దేశంతోనే ఈ దుష్ట సాంప్రదాయానికి తెరలేపారని విమర్శించారు. ఈ అంశంపై ప్రభుత్వం నియమించిన హౌస్ కమిటీ దానిపై హౌస్ కమిటీ మంగళవారం సభలో మధ్యంతర నివేదికను పొందుపరచడంతో టీడీపీ నేతల గుండెలు జారిపోయాయని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు కోర్టులో స్టే తెచ్చుకోకపోతే ఖచ్చితంగా జీవితాంతం జైలులో ఉంటారని అన్నారు. ఈ డేటా దొంగ డేరా బాబా కన్న డేంజర్ అన్నది ప్రజలు గమనించాలి అని మంత్రి ఆర్కే రోజా పిలుపునిచ్చారు.
టీడీపీది దుర్మార్గపు ఆలోచన
చంద్రబాబు హయాంలో డేటా చౌర్యం జరిగింది అనడానికి అనేక ఆధారాలు ఉన్నాయని సాక్షాత్తు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీయే స్పష్టం చేశారని గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ సాప్ట్‌వేర్ చంద్రబాబు కొనుగోలు చేశారని ఆమె చెప్పారని అన్నారు. ప్రజా సాధికారత సర్వేలో మొత్తం డేటా తీసుకుని దాదాపు 30 లక్షల ఓటర్లను తొలగించాలని దుర్మార్గపు ఆలోచన చేశారని మంత్రి రోజా ఆరోపించారు.
అంతేకాదు వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్ చేయించుకొని, వారిని బ్లాక్ మెయిల్ చేసి తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారని విమర్శించారు. ఇలాంటి టీడీపీ వాళ్లను వదిలిపెడితే సమాజం భ్రష్టు పట్టిపోతుందని మంత్రి రోజా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నారా లోకేశ్‌పైనా విరుచుకుపడ్డారు. లోకేశ్‌ను చూస్తే నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదని విమర్శించారు. ఒళ్లు తగ్గించేందుకు చేసిన కష్టంతోపాటు బుర్రలో ఉన్న గుజ్జు కూడా పెంచుకోవడానికి ప్రయత్నించాలని మంత్రి రోజా హితవు పలికారు.
98శాతం హామీలు అమలు చేసిన ఘనత జగన్‌దే
దివంగత సీఎం ఎన్టీఆర్‌పై ప్రేమ ఉంటే చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే అన్నా క్యాంటీన్లపై మొదటి సంతకం చేయాలి అని మంత్రి ఆర్కే రోజా సూచించారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు కారణమైన చంద్రబాబు ఈ రోజు ఎన్టీఆర్‌పై ఎక్కడా లేని ప్రేమ కురిపిస్తున్నారని అన్నారు. అన్నా క్యాంటీన్లు ఎన్ని పెట్టారో చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు.
ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలలో మూడున్నరేళ్లకే 98 శాతం హామీలు అమలు చేసినట్లు చెప్పుకొచ్చారు. తాజాగా అక్టోబర్ ఒకటి నుంచి వైఎస్‌ఆర్ కళ్యాణమస్తు, వైఎస్‌ఆర్ షాదీతోఫా పథకాలను అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు. అమ్ముడపోని నెయ్యి, పెరుగును అమ్ముకోవడానికి చంద్రన్న కానుక అంటూ ప్రజలకు అంటగడితే.. ప్రజలే సొంతంగా పండుగలు చేసుకునేలా వైఎస్ జగన్ నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నారు అని చెప్పుకొచ్చారు.
అంబేద్కర్ విదేశీ విద్యలోనూ అవినీతి
అంబేద్కర్ విదేశీ విద్యాలో పథకం ద్వారా టీడీపీ ఏవిధంగా దోచుకున్నారు. దాన్ని సక్రమంగా అమలు చేసేలా వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రపంచంలో 200 యూనివర్సిటీల్లో చదివే వారికి విదేశీ విద్యా పథకాన్ని అమలు చేస్తున్నాం అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు మోహానికి ఏ ఒక్క రోజైనా అమ్మఒడి పథకాన్ని అమలు చేశారా? 44 లక్షల మంది తల్లుల ఖాతాల్లో వైఎస్ జగన్ అమ్మఒడి డబ్బులు జమ చేశారు అని గుర్తు చేశారు.
ఇంత చేస్తున్న జగన్‌పై విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలను ప్రజలు మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలని ఉత్సాహంగా ఉన్నారు అని చెప్పుకొచ్చారు. మరోవైపు రాష్ట్రంలో సంక్షేమమే లేదు అని టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉన్నాయని విమర్శించారు. అసలు సంక్షేమానికి, టీడీపీకి ఏమైనా సంబంధం ఉందా? అని ప్రశ్నించారు. ఈ రోజు దేశంలోని అన్ని పార్టీలు, నాయకులు వైఎస్ జగన్ వైపు తిరిగి చూస్తున్నారు అని మంత్రి రోజా స్పష్టం చేశారు.