బ్రేకింగ్: YCP బహిష్కృత ఎమ్మెల్యేలకు మంత్రి రోజా సవాల్

by Satheesh |   ( Updated:2023-03-27 08:54:17.0  )
బ్రేకింగ్: YCP బహిష్కృత ఎమ్మెల్యేలకు మంత్రి రోజా సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలకు మంత్రి రోజా సవాల్ విసిరారు. పార్టీ సస్పెండ్ చేసిన నలుగురు ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని ఛాలెంజ్ చేశారు. ఎమ్మెల్యే రాపాక చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు నీచ రాజకీయాలకు అద్దం పడుతున్నాయని ఫైర్ అయ్యారు. ఒక్క ఎమ్మె్ల్సీ స్థానం గెలిచి ఏదో సాధించామని సంబురపడుతున్నారని ఎద్దేవా చేశారు. కొవిడ్ సమయంలో సీఎం జగన్ స్పెషల్ ఫ్లైట్ పెట్టి ఎమ్మెల్యే శ్రీదేవి ప్రాణాలు కాపాడితే.. వైసీపీ నుండి తనకు ప్రాణహాని ఉందని ఇప్పుడు ఆమె చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతోందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి ఆ నలుగురు ఎమ్మెల్యేలు పార్టీకి ద్రోహం చేశారని.. అందుకే వారిని సస్పెండ్ చేశారని అన్నారు.

Advertisement

Next Story