Minister Roja: హైదరాబాద్ వాళ్లు గెంటేశారు..

by srinivas |   ( Updated:2023-03-06 12:14:09.0  )
Minister Roja: హైదరాబాద్ వాళ్లు గెంటేశారు..
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా ఆసక్తికర ట్వీట్ చేశారు. విశాఖలో వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023ను ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ‘ఢిల్లీ వాడు వెక్కిరించినా.. మద్రాస్ వాడు వెళ్లగొట్టినా.. హైదరాబాద్ వాడు గెంటేసినా మా కాళ్ళ మీద మేము నిలబడుతున్నాం’ అంటూ రోజా ట్వీట్ చేశారు. అంతేకాదు పక్క రాష్ట్రాల రాజధానులకు ధీటుగా మా వైజాగ్‌ను తీర్చిదిద్దుతామని రోజా ట్విటర్ వేదికగా ధీమా వ్యక్తం చేశారు. ఏపీకి వచ్చే ఇన్వెస్టర్స్‌కు ట్విట్టర్ ద్వారా రోజా స్వాగతం పలికారు.

Advertisement

Next Story