పెద్దిరెడ్డి ఊచలు లెక్కపెట్టడం ఖాయం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
పెద్దిరెడ్డి ఊచలు లెక్కపెట్టడం ఖాయం.. మంత్రి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి పెద్దిరెడ్డి జైల్లో ఊచలు లెక్కపెట్టడం ఖాయమని మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం చిత్తూరు జిల్లాలో కొత్త ఆర్టీసీ బస్సులను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మాట్లాడారు. ఎల్లుండి పుంగనూరులో పర్యటిస్తా అని ప్రకటించారు. పెద్దిరెడ్డి బాధితులు అందరి వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని తెలిపారు. దీని కోసం పొరుగు రాష్ట్రాలు అమలు చేస్తున్న ఉచిత బస్సు విధానాన్ని అధ్యయనం చేస్తున్నాం. పూర్తి సమాచారం సేకరించిన అనంతరం కార్యక్రమ అమలుకు శ్రీకారం చుడతాం. ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీని గాలికి వదిలేసింది. ప్రజా రవాణా వ్యవస్థను నిర్లక్ష్యం చేసింది. ఆర్టీసీ సంస్థను గాడిలో పెట్టడంతోపాటు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాల అందించడం కోసమే కొత్త బస్సులు తెస్తున్నాం. అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.

Advertisement

Next Story