Sea Plane Cost: కామన్ మ్యాన్ కు అందుబాటులో సీ ప్లేన్.. ధరలపై మంత్రి రామ్మోహన్ ఏమన్నారంటే..

by Rani Yarlagadda |   ( Updated:2024-11-09 06:49:27.0  )
Sea Plane Cost: కామన్ మ్యాన్ కు అందుబాటులో సీ ప్లేన్.. ధరలపై మంత్రి రామ్మోహన్ ఏమన్నారంటే..
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ - శ్రీశైలం మధ్య నేడు సీ ప్లేన్ (Sea plane) ను సీఎం చంద్రబాబు నాయుడు (Cm Chandrababu) విజయవాడ వద్ద ప్రారంభించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సీ ప్లేన్ టికెట్ రేట్లపై ఇంత వరకూ క్లారిటీ రాలేదు. టికెట్ రేట్లపై ఊహాగానాలే తప్ప.. సరిగ్గా ఇంత ధర ఉంటుందన్న విషయం ఎవరూ చెప్పలేకపోతున్నారు. విజయవాడ - శ్రీశైలం మధ్య ఆధ్యాత్మికతను పెంచేలా, ఏపీ పర్యాటకాన్ని (AP Tourism) అభివృద్ధి చేసేలా దేశంలోనే తొలిసారి సీ ప్లేన్ ను మన ఏపీలో ప్రారంభించబోతున్నారు. దీనిపై తాజాగా కేంద్ర పౌరవిమానాయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) మాట్లాడుతూ.. సీ ప్లేన్ ను అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. దేశంలో తొలిసారి సీ ప్లేన్ సేవలు ఏపీలో ప్రారంభం కావడం మనకి గర్వకారణమని పేర్కొన్నారు. గతంలో గుజరాత్ లో సీ ప్లేన్ ను ప్రారంభించే ప్రయత్నాలు జరిగినా.. అవి సఫలం కాలేదన్నారు.

సామాన్యుడు సీ ప్లేన్ లో ప్రయాణించేలా ధర అందుబాటులో ఉంటుందని, ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. మరో 3,4 నెలల్లో ఏపీలో సీ ప్లేన్ సేవలు పూర్తిగా అందుబాటులోకి వస్తాయన్నారు. రాష్ట్రంలో మొత్తం 4 రూట్లలో సీ ప్లేన్లను నడిపే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ - నాగార్జున సాగర్ (Vijayawada - Sagar), విజయవాడ - హైదరాబాద్ (Vijayawada - Hyderabad) రూట్లకు కూడా ఆమోదం వచ్చిందని, అమరావతికి కనెక్ట్ చేసేలా స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. రెగ్యులర్ ట్రావెల్ కు మరో 4 నెలల సమయం పడుతుందన్నారు రామ్మోహన్ నాయుడు. 2025 మార్చి నుంచి రెగ్యులర్ సీ ప్లేన్ సేవలు ప్రారంభం కానున్నట్లు స్పైస్ జెట్ ప్రతినిధి వెల్లడించారు.

ప్రకాశం బ్యారేజీ వద్ద పున్నమిఘాట్ (Punnami Ghat) వద్ద నుంచి సీఎం సీ ప్లేన్ ను ప్రారంభించి.. అందులోనే శ్రీశైలం వరకూ ప్రయాణించనున్నారు. మధ్యాహ్నం 12.40 గంటలకు సీఎం శ్రీశైలంకు చేరుకోనున్నారు. దీంతో పున్నమి ఘాట్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సీ ప్లేన్ లో 14 మంది కూర్చునేలా సీటింగ్ ఉంటుంది. నీటిపైనే టేకాఫ్, ల్యాండింగ్ ఉంటాయి. సీ ప్లేన్ ద్వారా 30 నిమిషాల్లోనే శ్రీశైలంకు చేరుకోవచ్చు.

Advertisement

Next Story

Most Viewed