AP Free Bus: మహిళలకు గుడ్ న్యూస్.. తల్లికి వందనం, ఫ్రీ బస్ పై కీలక నిర్ణయం

by Y.Nagarani |
AP Free Bus: మహిళలకు గుడ్ న్యూస్.. తల్లికి వందనం, ఫ్రీ బస్ పై కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) రూ.2 లక్షల 94 వేల 427.25 కోట్లతో వార్షిక బడ్జెట్ ను (AP Budget 2024-25) ప్రవేశపెట్టి.. వివిధ శాఖలకు బడ్జెట్ కేటాయింపులను వివరించారు. ఇందులో మహిళా, శిశు సంక్షేమ శాఖకు రూ.4,285 కోట్లను కేటాయించారు. బడ్జెట్ కు ముందు చంద్రబాబు పాలనపై మాట్లాడిన పయ్యావుల.. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం (Talliki Vandanam) పథకానికి నిధులు కేటాయిస్తామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందిస్తామని పేర్కొన్నారు. ఏ విద్యార్థీ పేదరికం కారణంగా చదువుకు దూరం కాకూడదనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వివరించారు. అలాగే రాష్ట్రంలో త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.

మహిళలు సాధించిన పురోగతి స్థాయిని బట్టి సమాజ పురోగతిని కొలుస్తానన్న అంబేద్కర్ మాటలను అనుసరించే.. సీఎం చంద్రబాబు మహిళా సాధికారతపై దృష్టి సారించారన్నారు. దీపం -2 (Deepam 2 Scheme) పథకం ద్వారా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నామన్నారు. ఇప్పటికే 5 లక్షల మంది మహిళలు ఇప్పటికే లబ్ధి పొందారన్నారు.

Advertisement

Next Story