జోగి రమేశ్ సన్ రాజీవ్‌ అరెస్ట్.. మంత్రి పార్థసారధి కీలక వ్యాఖ్యలు

by srinivas |
జోగి రమేశ్ సన్ రాజీవ్‌ అరెస్ట్.. మంత్రి పార్థసారధి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: అగ్రి గోల్డ్ భూ వ్యహహారంలో మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు రాజీవ్‌ను ఏసీబీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దీంతో బెయిల్ కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అయితే జోగి రాజీవ్ అరెస్ట్ కక్ష సాధింపు చర్యేనంటూప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పార్థసారథి స్పందించారు. అగ్రిగోల్డ్ భూ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలో చట్టం తన పని చేసుకుపోతుందని చెప్పారు. రాజీవ్‌ను ఉద్దేశ పూర్వకంగా అరెస్ట్ చేయలేదని చెప్పారు. చట్ట విరుద్ధంగా అగ్రిగోల్డ్ భూములను జోగి రమేశ్ కుంటుబం కొనుగోలు చేయడమే కాకుండా విక్రయించిందని తెలిపారు. గ్రామ సర్వేయర్ దేదీప్య సైతం తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందని చెప్పారు. జోగి రాజీవ్‌తో పాటు పలువురిపైనా కేసులు నమోదు అయ్యాయని పార్థసారథి గుర్తు చేశారు.

ప్రభుత్వం, ఏసీబీ విచారణపై అనుమానాలుంటే కేసులు వేయొచ్చని మంత్రి పార్థసారథి తెలిపారు. అధికారంలో ఉండగా అగ్నిగోల్డ్ భూములను కబ్జా చేశారని ఆరోపించారు. తప్పు లేకపోతే సమస్యను ఆ రోజే పరిష్కరించాల్సిందని, ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కావాలనే రాజీవ్ అరెస్ట్‌ను రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. బలహీన వర్గాలపై అక్రమంగా కేసులు పెట్టినట్లు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కులం, వర్గం, రాజకీయ రంగు పులమాల్సిన అవసరం లేదని చెప్పారు. కోర్టులో తమ నిజాయితీని నిరూపించుకోవాలని పార్థసారథి సూచించారు.

Advertisement

Next Story

Most Viewed