ఏపీ, తెలంగాణ మధ్య వివాదం.. మంత్రి నిమ్మల సంచలన వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2024-06-15 10:34:53.0  )
ఏపీ, తెలంగాణ మధ్య వివాదం.. మంత్రి నిమ్మల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రాజెక్టులపై మంత్రి నిమ్మల దృష్టి సారించింది. ఏపీ, తెలంగాణ మధ్య జరుగుతున్న జల వివాదాలపై ఆయన ఆరా తీశారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలకు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డినే కారణమన్నారు. జగన్ అధికారంలోకి ఉండగా అనాలోచిత నిర్ణయాలు చేశారని.. దాని వల్లే కృష్ణా జలాలపై అంతర్రాష్ట్ర వివాదం తలెత్తిందని మండిపడ్డారు. అంతేకాదు జగన్ తన ఐదేళ్ల కాలంలో ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యామ్‌ను సకాలంలో పూర్తి చేయలేదని, అందువల్లే 2020 ఆగస్టు వరదలకు పోలవరం డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తాము అధికారంలో ఉన్న సమయంలో 70 శాతం పోలవరం పనులను పూర్తి చేశామని గుర్తు చేశారు. ఈ ఐదేళ్ల కాలంలో పోలవరం పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed