- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాజధాని నిర్మాణం.. ఇక చకచకా..!
దిశ, డైనమిక్ బ్యూరో: వీలైనంత త్వరగా అమరావతి ప్రాజెక్ట్ పూర్తి చేసేలా ముందుకెళ్తున్నామని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరి నారాయణ అన్నారు. మంగళవారం ఉదయం ఆయన స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ను కలిసి వెంకటపాలెంలో నిర్మాణంలో ఉన్న అంగన్‌వాడీ సెంటర్, ఈ-హెల్త్ సెంటర్, మందడంలో నిర్మాణంలో ఉన్న అంగన్‌వాడి భవనాన్ని పరిశీలించారు. అమరావతి స్మార్ట్ సిటీలో భాగంగా నిర్మిస్తున్న పలు భవనాలను కూడా పరిశీలన చేశారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడంతో రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిందన్నారు. శాఖలవారీగా చేసిన కేటాయింపులను కూడా ఇతర అవసరాలకు ఖర్చు పెట్టేసిందని ఆరోపించారు. మూడు ముక్కలాట ఆడి అమరావతిని నాశనం చేసిందని మండిపడ్డారు. అమరావతి నిర్మాణం పూర్తయితే ప్రపంచంలో నెంబర్ వన్‌గా ఉండేదన్నారు. రాజధాని అమరావతిని పూర్తి చేయడంలో తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా నారాయణ పునరుద్ఘాటించారు.