- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News:పెన్షన్ల పంపిణీ పై మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో నేడు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఎన్నికల హామీల్లో చెప్పిన విధంగానే టీడీపీ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈక్రమంలో నేడు సీఎం చంద్రబాబు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని పెనుమాక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి నారా లోకేష్ , పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పెన్షన్లపై మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవ్వా తాతల కళ్లలో నేను చూసిన ఆనందం జీవితాంతం గుర్తుంటుంది. ప్రజా నాయకుడికి, పరదాల నాయకుడికి మధ్య తేడా ప్రజలకు అర్థమైంది అన్నారు. మాట మార్చుడు లేదు..మడమ తిప్పుడు లేదు..విడతల వారి డ్రామాలు లేవు అన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం పెద్ద కొడుకుగా పెన్షన్‌ను చంద్రన్న రూ.4వేలు చేశారని, ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేశారని పేర్కొన్నారు.