- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP News:3,220 ఉద్యోగాలు భర్తీ చేయాలని మంత్రి నారా లోకేష్ ఆదేశం
దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం ఉన్నత విద్య అంశంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో ఏపీలోని యూనివర్శిటీల్లో ఖాళీగా ఉన్న 3,220 ఉద్యోగాలను భర్తీ చేయాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఈ ఉద్యోగాల భర్తీలో నెలకొన్న న్యాయపరమైన చిక్కులను తొలగించాలని సూచించారు. పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగా పోస్టుల భర్తీ ఉండాలని ఉన్నత విద్య పై అధికారులతో సమీక్షలో లోకేష్ వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలో విద్యా దీవెన, వసతి దీవెన స్థానంలో పాత విధానం అమలు చేస్తామని మంత్రి లోకేష్ చెప్పారు. ఫీజు రీయింబర్స్ మెంట్‌కు విధివిధానాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం రూ.3,480 కోట్ల మేర బకాయిలు ఇవ్వలేదని ఆరోపించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు తగ్గడంపై మంత్రి నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. కాలేజీల్లో డ్రగ్స్ పై విద్యార్థులను చైతన్యం చేసేందుకు స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.