అన్నదాతలకు అదిరిపోయే శుభవార్త..మంత్రి నాదేండ్ల మనోహర్ కీలక ప్రకటన

by Jakkula Mamatha |   ( Updated:2024-08-12 08:31:12.0  )
అన్నదాతలకు అదిరిపోయే శుభవార్త..మంత్రి నాదేండ్ల మనోహర్ కీలక ప్రకటన
X

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో నూతనంగా ఏర్పడిన టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమంతో పాటు రైతుల శ్రేయస్సు కోసం పాటు పడుతోంది. ఈ క్రమంలో తాజాగా వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి పైన ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ అన్నారు. ఏలూరు జరిగిన రైతులకు ధాన్యం బకాయిల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గత రబీకి సంబంధించిన రూ.674 కోట్ల ధాన్యం బకాయిలను మంత్రి నాదెండ్ల మనోహర్ విడుదల చేశారు. ఈ క్రమంలో మంత్రి నాదేండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. రాబోయే ఖరీఫ్‌లో 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తాం అని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఆర్థిక అరాచకాలకు పాల్పడింది. గత ప్రభుత్వంలో రూ.12 లక్షల కోట్ల అప్పులు చేసిందని విమర్శించారు. ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ గత నెలలో 49,350 మంది రైతులకు రూ.వెయ్యి కోట్ల ధాన్యం బకాయిలను చెల్లించాం అన్నారు. ఇవాళ మరో 35,374 మందికి రూ.674 కోట్లు అందించామని తెలిపారు.

Advertisement

Next Story