Nara Lokesh:ఏపీలో ఫీజు రియంబర్స్‌మెంట్‌పై మంత్రి లోకేష్ కీలక నిర్ణయం

by Jakkula Mamatha |
Nara Lokesh:ఏపీలో ఫీజు రియంబర్స్‌మెంట్‌పై మంత్రి లోకేష్ కీలక నిర్ణయం
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు అన్ని శాఖలపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫీజు రియంబర్స్‌మెంట్‌ పథకం గురించి తాజాగా కీలక అప్‌డేట్ వెల్లడించారు. వచ్చే నెల 11వ తేదీన సీఎం చంద్రబాబు సమక్షంలో ఫీజ్ రీయంబర్స్‌మెంట్ అమలు మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వం తీసుకున్న విధానాల వల్ల స్కూల్ డ్రాపౌట్స్ పెరిగాయని లోకేష్ మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకున్న నిర్ణయాలు సమీక్షిస్తున్నామని మంత్రి తెలిపారు.

ఈ క్రమంలో ‘నాడు నేడు పథకం’,‘మన బడి మన భవిష్యత్’ పేరుతో కొనసాగిస్తామని ప్రకటించారు. సీబీఎస్‌ఈ పరీక్షలకు ప్రిపరేషన్ లేకుండా వెళ్లడంతో విద్యార్థులకు నెగటివ్ ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో విద్యా వ్యవస్థలో సంస్కరణలు అవసరం అని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థ పై ప్రత్యేక ఫోకస్ పెట్టిందని విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed