Nara Lokesh:ఒమన్‌లో చిక్కుకొని మహిళ ఆవేదన..రంగంలోకి మంత్రి లోకేష్

by Jakkula Mamatha |
Nara Lokesh:ఒమన్‌లో చిక్కుకొని మహిళ ఆవేదన..రంగంలోకి మంత్రి లోకేష్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. రాష్ట్రాభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా వింటూ పరిష్కరిస్తున్నారు. ఇటీవల మంత్రి లోకేష్ ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లి ఇబ్బంది పడుతున్న వారిని స్వరాష్ట్రానికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో తాజాగా విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ మహిళ వీడియోను చూసి మంత్రి లోకేష్ స్పందించారు. ఉద్యోగం కోసం ఒమన్ దేశానికి వెళ్లి ఇబ్బందిపడుతున్న మామిడి దుర్గ అనే మహిళకు మంత్రి లోకేష్ భరోసానిచ్చారు. ఏజెంట్లు ద్వారా ఒమన్ దేశానికి వెళ్లి చిక్కుకుపోయా అని ఆమె వీడియో షేర్ చేశారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించి లేవలేని స్థితిలో ఉన్నానని, రక్షించాలంటూ ప్రాధేయపడ్డారు. లోకేష్ స్పందిస్తూ ‘భయపడకు అమ్మా. టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం నుంచి విదేశాంగ శాఖతో మాట్లాడి త్వరలోనే నిన్ను ఇండియాకు తీసుకొస్తాం అని ట్వీట్ చేశారు.

Advertisement

Next Story