- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ స్టిక్కర్ మాది కాదు.. పోలీసులకు మంత్రి కాకాని పీఏ ఫిర్యాదు
దిశ, వెబ్ డెస్క్: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మొత్తం 101 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే రేవ్ పార్టీ నిర్వహించిన చోట ఏపీ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి పేరుతో ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ కారు కలకలం రేపింది. దీంతో మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి లేదా, ఆయనకు సంబంధించిన వాళ్లు రేవ్ పార్టీలో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై స్పందించిన కాకాని పీఏ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ స్టిక్కర్‌తో తమకు సంబంధంలేదని.. ఆ రేవ్ పార్టీలో తమ వాళ్లు లేరని తెలిపారు. అసలు ఆ స్టిక్కర్ ఎలా వచ్చిందో తెలియదన్నారు. దర్యాప్తు చేసి నిందితులను పట్టుకోవాలని పోలీసులను మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి పీఏ కోరారు.
అంతుకుముందు మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి మాట్లాడుతూ రేవ్ పార్టీలో దొరికిన కారుతో కానీ, ఓనర్‌తో గానీ, అందులో ప్రయాణించిన వాళ్లతో గాని తమకు సంబంధం లేదని తెలిపారు. ఆ కారు రిజిస్ట్రేషన్ విజయవాడకు చెందిన తుమ్మల వెంకటేశ్వరరావు అనే వ్యక్తి పేరుతో ఉందని, అతనితో తనకు పరిచయం లేదన్నారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే కావాలనే తనపై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తన ప్రమేయం లేకుండానే ఎమ్మెల్యే స్టిక్కర్ వినియోగించారని, పోలీసులకు ఫిర్యాదు చేశామని మంత్రి కాకాని పేర్కొన్నారు.