- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజా సంక్షేమ పాలనకు నాలుగేళ్లు పూర్తి.. మంత్రి కాకాణి
దిశ, నెల్లూరు: సీఎం జగన్ ప్రభుత్వ హయాంలో ప్రజా సంక్షేమ పాలన నేటితో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుందని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నెల్లూరు జిల్లా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నడూ, ఎవరూ ఆలోచన చేయని విధంగా జగన్ సంక్షేమ పథకాలను అందిస్తూ, సంక్షేమ పథకాల లబ్ది ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా, నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమం, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ, ప్రజారంజక పాలనను అందిస్తున్నారని కొనియాడారు. అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్రం, దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు. జగన్ ముఖ్యమంత్రిగా 4 సంవత్సరాల కాలంలో ఎన్నో అవాంతరాలను, ఒడిదుడుకులను ఎదుర్కొన్నా, ప్రజలకు సంక్షేమ పాలన అందించడంలో రాజీ పడలేదని స్పష్టం చేశారు.
వికలాంగులకు ట్రై సైకిల్లు పంపిణీ చేసిన కాకాణి
నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో 18 మంది వికలాంగులకు 18 లక్షలు విలువచేసే మోటరైజ్డ్ త్రిచక్ర వాహనాలను జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్ తో కలిసి కాకాణి పంపిణీ చేశారు. విభిన్న ప్రతిభావంతులకు చేయూత అందించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని మంత్రి వివరించారు. విభిన్న ప్రతిభావంతుల్లో నైపుణ్యం పెంచేందుకు ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.