చంద్రబాబు గ్రాఫ్ ఎంత పడిపోయిందో తెలుసా?

by GSrikanth |
చంద్రబాబు గ్రాఫ్ ఎంత పడిపోయిందో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లాలో చంద్రబాబు నిర్వహించిన ‘రా కదలి రా’ సభ అట్టర్ ప్లాప్ అయిందని విమర్శించారు. ఎంత గొంతు చించుకున్నా చంద్రబాబు ప్రసంగం ప్రజలను ఆకర్షించలేకపోతోందని.. అందుకే ప్రజలను రెచ్చగొట్టేలా వైసీపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేయసాగాడని అన్నారు. చంద్రబాబు గ్రాఫ్ ఎంత పడిపోయిందో అందరికీ అర్థమైపోయిందని తెలిపారు. చంద్రాబాబే కాదు.. టీడీపీ నేతల్లో ఎవరికి దమ్మున్నా వ్యవసాయ రంగంపై చర్చకు రావాలని సవాల్ చేశారు. ఇప్పటికే అనేకసార్లు సవాల్ చేశానని.. దమ్ము లేదు కాబట్టే చంద్రబాబు స్పందించడం లేదని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో, నెల్లూరులో 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే మళ్లీ రిపీట్ కాబోతున్నాయని అన్నారు. నెల్లూరు సిటీకి సంబంధించిన తమకు ఇంకా ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. టీడీపీని కోలుకోలేని దెబ్బ కొట్టే విధంగా గట్టి అభ్యర్థులను బరిలోకి దింపాలని అధిష్టానం ఆలోచిస్తోందని అన్నారు. అందులో భాగంగానే కొత్త ఎక్సర్‌సైజ్ ప్రారంభించారని తెలిపారు. దీనిపై కొన్ని రోజుల్లోనే స్పష్టత వస్తుందని వెల్లడించారు. షర్మిల కేవలం చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రి చేయడానికే పరిచేస్తున్నారని.. ఇందులో ఎలాంటి గందరగోళానికి గురికావాల్సిన అవసరం లేదని అన్నారు. ఎంత మంది వచ్చినా మళ్లీ జగన్‌ను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story