చంద్రబాబు పనిచేసింది అధికారం కోసమే కానీ అభివృద్ధి కోసం కాదు..మంత్రి కాకాణి

by Indraja |   ( Updated:2024-01-20 12:30:26.0  )
చంద్రబాబు పనిచేసింది అధికారం కోసమే కానీ అభివృద్ధి కోసం కాదు..మంత్రి కాకాణి
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ నేత మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చంద్రబాబు పై సంచల వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు తన హయాంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. 2014 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారం చేపట్టిన తరువాత అమరావతిని అడ్డుపెట్టుకోని ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును కాజేసేందుకు యత్నించారని మండిపడ్డారు. అసలు చంద్రబాబు ఎప్పుడు కూడా ప్రజల గురించి పట్టించుకోలేదని ఆరోపించిన ఆయన.. చంద్రబాబు సొంతంగా ప్రజల కోసం తెచ్చిన పథకం ఏదైనా ఉందా..? అని ప్రశించారు.

చంద్రబాబు ప్రతిదీ కాపీ కొట్టడమేనని ఆయన ఎద్దేవా చేశారు. కర్ణాటక ప్రభుత్వం అక్కడ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని.. చంద్రబాబు కూడా ఆంధ్రలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాననడం పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడమే అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎప్పుడూ అధికారం కోసం పనిచేసారేగాని అభివృద్ధి కోసం పని చెయ్యలేదు అని ఆరోపించారు. ఇక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తానిచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేకపోయారో ప్రజలకు వివరణ ఇచ్చారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

Read More..

అరకు అసెంబ్లీ TDP అభ్యర్థి ఫిక్స్.. ‘రా కదలి రా’ సభలోనే ప్రకటించిన చంద్రబాబు

Advertisement

Next Story