బావ కోసం తండ్రిని కాటికి పంపిన వ్యక్తి బాలకృష్ణ: మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-01-15 05:23:19.0  )
బావ కోసం తండ్రిని కాటికి పంపిన వ్యక్తి బాలకృష్ణ: మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోందన్న బాలయ్య వ్యాఖ్యలపై మంత్రి జోగి రమేష్ ఫైర్ అయ్యారు. బావ కళ్లలో ఆనందం చూడటం కోసం తండ్రిని కాటికి పంపిన వ్యక్తి బాలకృష్ణ అని మంత్రి జోగి రమేష్ సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయాలకు బాలకృష్ణ పూర్తిగా అనర్హుడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోందన్న బాలయ్యకు.. ఐదుకోట్ల మంది ప్రజలను అడిగితే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుస్తోందని అన్నారు. అసలు బాలకృష్ణకు ఎమర్జెన్సీ అంటే అర్థం తెలుసా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు, బాలకృష్ణకు ఏపీలో అడ్రసే లేదని ఎద్దేవా చేశారు. నువ్వు వేషాలేసుకునే ఓ సినిమా యాక్టర్ మాత్రమేనన్నారు. ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచేలా చేసింది సీఎం జగన్ అని అన్నారు.

Read more:

నా కొడుకు, నేను రాజకీయాల నుండి తప్పుకుంటున్నాం: మాజీ మంత్రి దగ్గుబాటి షాకింగ్ డెసిషన్

Advertisement

Next Story