చంద్రబాబుపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. మంత్రి జోగి రమేశ్‌కు నోటీసులు

by srinivas |   ( Updated:2024-04-04 15:30:35.0  )
Jogi Ramesh
X

దిశ, వెబ్ డెస్క్: మంత్రి జోగి రమేశ్ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారు. వాలంటీర్ల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు సీరియస్ అయ్యారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఆధారాలను అందజేశారు. చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ఎన్నికల సంఘం స్పందించింది. ఎవరూ కూడా అభ్యంతర వ్యాఖ్యలు చేయొద్దని సూచనలు చేశామని ఈసీ వెల్లడించింది. మంత్రి జోగి రమేశ్‌కు నోటీసులు జారీ చేసింది. రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. సమాధానం ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

కాగా ఏపీలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో రాజకీయ పార్టీల పోస్టర్లు, బ్యానర్లు, ఫెక్సీలను తొలగించారు. అంతేకాదు ఎన్నికల నిబంధనలు ప్రతిఒక్కరూ పాటించాలని ఈసీ ఆదేశించింది. ఎవరు అతిక్రమించినా చర్యలు ఉంటాయని హెచ్చరించింది. అయినా సరే నేతలు ఎన్నికల ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం స్పందించి వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed