Pawan Kalyan ఎక్కడ పోటీ చేసినా ఓడించి తీరుతాం: Minister Jogi Ramesh

by Satheesh |   ( Updated:2022-11-28 10:28:07.0  )
Pawan Kalyan ఎక్కడ పోటీ చేసినా ఓడించి తీరుతాం: Minister Jogi Ramesh
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి జోగి రమేష్ నిప్పులు చెరిగారు. అధికారంలోకి వచ్చిన తర్వాత లీగల్‌గా వైసీపీ ఎమ్మెల్యే ఇళ్లు కూలుస్తామని మాట్లాడుతున్న పవన్ కల్యాణ్ ఓ వీకెండ్ సైకో అని తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తానని కలల కంటున్న పవన్ కల్యాణ్‌ను.. వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుండి పోటీ చేసిన ఓడించి తీరుతామని సవాల్ చేశారు. పవన్ కల్యాణ్‌కు సత్తా ఉంటే ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా సింగల్ పోటీ చేయాలని డిమాండ్ చేశారు. కోడి కత్తి రాజకీయాలు అని విమర్శలు చేసిన వారికి.. వైసీపీకి 151 స్థానాలు ఇచ్చి ప్రజలే బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. ఇప్పటం ప్రజలను పవన్ కల్యాణ్ నిట్టనిలువుగా ముంచేశాడని విమర్శించారు. ఇప్పటం ప్రజలను రెచ్చగొట్టి కోర్టు చేత మొట్టికాయలు తినేటట్టు పవనే చేశాడని ఆరోపించారు. పవన్ కల్యాణ్ ఇకనైనా చిల్లర వేషాలు మానుకోవాలని హితవు పలికారు.

ఇవి కూడా చదవండి : ఏదో ఒకరోజు పవన్‌ను సీఎంగా చూసి గర్వపడతా: S.J. Surya

Advertisement

Next Story