- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవన్ కల్యాణ్‌ది ఒక బానిస బతుకు: మంత్రి అమరనాథ్ తీవ్ర విమర్శలు
దిశ, వెబ్‌డెస్క్: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మూడవ విడత వారాహి విజయ యాత్ర ప్రారంభించడంతో మరోసారి ఏపీలో మరోసారి పవన్ వర్సెస్ వైసీపీగా రాజకీయం మారింది. వారాహి యాత్రలో భాగంగా గురువారం విశాఖలో ప్రభుత్వంపై పవన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తాజాగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు మంత్రి గుడివాడ అమరనాథ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. 15 ఏళ్లుగా రాజకీయాల్లో ఏం సాధించారని పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు.
గడిచిన పదేళ్లలో ఆరు, ఏడు పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారని.. అసలు విధి విధానాల్లేని రాజకీయ నేత పవన్ కల్యాణ్ అని ఘాటు విమర్శలు చేశారు. పవన్‌కు ఓ విధానం.. ఓ సిద్ధాంతం లేదన్నారు. బీజేపీతో సంసారం.. టీడీపీతో సహజీవనం అని ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడమే పవన్ కల్యాణ్ పని అని అన్నారు. పవన్ కల్యాణ్‌కు పొలిటికల్ ప్రొడ్యూసర్ చంద్రబాబు అని విమర్శించారు. సీఎం జగన్‌ను తిడితే నాయకుడిని అయిపోతానని పవన్ భావిస్తున్నారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్‌ది ఒక బానిస బతుకు అని తీవ్ర విమర్శలు చేశారు.
Read More : అమ్మా రేణూ మీ మాజీకి చెప్పు అంటూ అంబటి రాంబాబు ఆసక్తికర ట్వీట్