''పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టార్ కాదని తన తల్లి, అన్నయ్యపై ఒట్టేసి చెప్పగలరా..?''

by Satheesh |
పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టార్ కాదని తన తల్లి, అన్నయ్యపై ఒట్టేసి చెప్పగలరా..?
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన రణస్థలి సభలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించాయి. తనపై ఇష్టమెచ్చినట్లు విమర్శలు చేసే వారిని చెప్పుతో కొడతానంటూ పవన్ ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్‌పై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. పవన్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా వైసీపీ నేతలు విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి గుడివాడ పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. పవన్ కల్యా్ణ్‌ది దిగజారుడు రాజకీయామని.. పవన్ పార్టీ పేరును జనసేన తీసేసి చంద్రసేన అని పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టార్ కాదని తన తల్లి, అన్నయ్యపై ఒట్టేసి చెప్పగలరా అని అమర్నాథ్ ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ సినిమాల్లో హీరో కావచ్చని.. రాజకీయాల్లో మాత్రం విలన్ అని ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed