Minister Gottipati: ఫెంగాల్ తుపాన్ ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి గొట్టిపాటి కీలక ఆదేశాలు

by Shiva |   ( Updated:2024-11-30 08:56:13.0  )
Minister Gottipati: ఫెంగాల్ తుపాన్ ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి గొట్టిపాటి కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఫెంగల్ తుపాన్ (Fengal Typhoon) నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Gottipati Ravi Kumar) అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కరెంట్‌ కోతలు లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ మేరకు వర్షాలు కురుస్తున్న నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల అధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ (Tele Conference) నిర్వహించారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితులను మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కరెంట్ స్తంభాలు నెలకొరిగే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారులకు సమాచారం అందజేయాలని అన్నారు. విద్యుత్ సమస్యలపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి యుద్ధ ప్రాతిపదికన అధికారులకు అప్రమత్తమై ఆ సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఫెంగల్ తుపాన్ (Fengal Typhoon) కారణంగా తిరుపతి జిల్లా (Tirupati District)లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు, అంగన్వాడీ కేంద్రాలకు, జూనియర్ కళాశాలకు కలెక్టర్ వెంకటేశ్వర్ (Collector Venkateshwar) సెలవు‌‌ ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed