Dadisetty Raja :పవన్ కల్యాణ్ మానసిక వైద్యుడికి చూపించుకోవాలి: మంత్రి దాడిశెట్టి రాజా కౌంటర్

by Satheesh |   ( Updated:2023-06-17 08:00:46.0  )
Dadisetty Raja :పవన్ కల్యాణ్ మానసిక వైద్యుడికి చూపించుకోవాలి: మంత్రి దాడిశెట్టి రాజా కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై మంత్రి దాడిశెట్టి రాజా తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ఫెయిల్ అయ్యిందని మంత్రి ఎద్దేవా చేశారు. పవన్ సభలకు జనం రాకపోతే వాళ్ల యజమాని ప్యాకేజీ ఇవ్వరని సెటైర్లు వేశారు. ఎమ్మెల్యే అవ్వాలన్నా.. సీఎం అవ్వాలన్నా.. ముందు జనం ఓట్లు వేయాలని పవన్ కల్యాణ్‌కు కౌంటర్ ఇచ్చారు. అసలు పవన్ కల్యాణ్ ఎక్కడ పోటీ చేయాలో కూడా ఆయన యజమాని డిసైడ్ చేయాలని ఎద్దేవా చేశారు. కొత్తగా బాబా అవతారమెత్తిన పవన్ కల్యాణ్ మళ్లీ వచ్చి అమరావతి అంటున్నారని అన్నారు. ఒక్కరోజైనా పవన్ కుటుంబంతో అమరావతికి వచ్చాడా అని ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతోన్న పవన్ కల్యాణ్ మానసిక వైద్యుడికి చూపించుకోవాలని సెటైర్ వేశారు.

Read more: మారిన సీన్​ .. వైసీపీ ప్రభుత్వంపై షా, నడ్డా ఆరోపణల తర్వాత గందరగోళం​

Advertisement

Next Story