‘పోటీ నుండి తప్పుకుంటా’.. వైసీపీ మంత్రి భార్య సంచలన ప్రకటన

by Satheesh |   ( Updated:2024-05-11 15:02:46.0  )
‘పోటీ నుండి తప్పుకుంటా’.. వైసీపీ మంత్రి భార్య సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి, విశాఖ లోక్ సభ ఎంపీ అభ్యర్థిని బొత్స ఝాన్సీ సంచలన ప్రకటన చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ కూటమి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపితే పోటీ నుండి తప్పుకుంటానని సవాల్ విసిరారు. పోలింగ్‌కు ఇంకా 48 గంటల సమయం ఉందని ఈ లోగా కూటమి తన సవాల్ స్వీకరించి ప్రైవేటీకరణ చేయమని ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. పబ్లిక్ సెక్టార్‌లోనే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కొనసాగిస్తామని హామీ ఇవ్వాలన్నారు. కూటమి తన సవాల్ స్వీకరించాలని.. లేదంటే ఎన్నికల్లో కూటమిని ప్రజలు బహిష్కరించాలని ఆమె పిలుపునిచ్చారు. కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో పోటీ నుండి తప్పుకుంటానని వైసీపీ అభ్యర్థిని ప్రకటించడం ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Read More..

కొత్తగా ఓటు వేస్తున్నారా.. ఇలా చేస్తే క్యూలైన్‌ను ఫోన్‌లో చూడొచ్చు..!

Advertisement

Next Story