- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap Cabinet ప్రక్షాళనపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ కేబినెట్ ప్రక్షాళనపై సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చేశారు. కేబినెట్‌లో మార్పులు జరుగుతాయన్న ఊహాగానాలు సరికాదన్నారు. తనలాంటి మంత్రులు ఇలాంటి ఊహాగానాలపై స్పందించడం కూడా సమంజసం కాదని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలకు, మంత్రివర్గం ప్రక్షాళనకు సంబంధం ఏముందని ప్రశ్నించారు. అయినా ఒకవేళ మంత్రివర్గ విస్తరణ ఉంటే అందులో తప్పేముందన్నారు. ముఖ్యమంత్రి పరిపాలనా సౌలభ్యం కోసం కేబినెట్ ఏర్పాటు ఉంటుందన్నారు. కేబినెట్‌లోకి ఎవరిని తీసుకోవాలనేది సీఎం విచక్షణాధికారం, ఆయన ఇష్టమని పేర్కొన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం మార్పులు, చేర్పులు ఎప్పుడైనా చేసుకోవచ్చని మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఓటమిపై సమీక్షించుకుంటాం
‘ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ఓటమిపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఓటమికి బాధ్యత వహించారు. మా వైఫల్యమే ఓటమికి కారణం. ఈ ఎన్నికల్లో లోపం ఎక్కడుందో సమీక్షించుకుంటాం. ఓటమిని వేరే వారిపైకి నెట్టడం నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ చేయలేదు. అలా అని తప్పించుకు పారిపోయే వ్యక్తిని కాదు. మూడు రాజధానుల అనేది మా ప్రభుత్వ విధానం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ కేంద్రంగా పరిపాలన ప్రారంభించాలన్నదే మా అభిప్రాయం.’ అని బొత్స తెలిపారు.
ముందస్తుతో ఆయనకే నష్టం
అటు డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సిన అవసరం తమకు లేదని క్లారిటీ ఇచ్చారు. ముందస్తు ఎన్నికలు వస్తే చంద్రబాబు ఇంకా దిగజారిపోతారంటూ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు.