- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Atchannaidu: జగన్ మాటలు వింటుంటే నవ్వొస్తోంది
by Gantepaka Srikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. గురువారం సచివాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు.. విలువల గురించి జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. కాగా, అంతకుముందు టీడీపీ పొలిటికల్ బ్యూరో సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే నామినేటెడ్ పదవులు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. కూటమిలోని మూడు పార్టీల నేతలకు నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. ముఖ్యంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తమ సీటు త్యాగం చేసిన నేతలకు ప్రయారిటీ ఉంటుందని అన్నారు.
Advertisement
Next Story