పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాల వేళ మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2024-07-21 17:20:56.0  )
పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాల వేళ మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విభజన హామీలను వదులుకునే ప్రసక్తి లేదని తెలిపారు. హిందూ దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా కాలేదని, అప్పుడే జగన్ దుష్ప్రచారం మొదలు పెట్టారని ఎద్దేవా చేశారు.సచివాలయాల్లో ఇంకా కుర్చిలే సరిగ్గా సర్దుకోలేదని, ప్రభుత్వంపై జగన్ చేస్తున్న విమర్శలు సరికాదని సూచించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. వైసీపీని ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం చేసినా జగన్ మోహన్ రెడ్డికి మాత్రం పదవీ వ్యామోహం పోలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఘటన జరిగినా టీడీపీపై బురదజల్లుతున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు.

Advertisement

Next Story