Nellore: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అవమానం.. క్షమాపణలు చెప్పిన మంత్రి ఆనం

by srinivas |
Nellore: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అవమానం.. క్షమాపణలు చెప్పిన మంత్రి ఆనం
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి(MP Vemireddy Prabhakar Reddy)కి అవమానం జరిగింది. జిల్లా రివ్యూ కమిటీ సమావేశం(Nellore District Review Committee meeting)లో మంత్రులు ఎండీ ఫరూక్, ఆనం రామరాయాణ రెడ్డి, నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అధికారులు ఆహ్వానించారు. అయితే ఆ సమయంలో వేమిరెడ్డికి అధికారులు బొకే ఇవ్వలేదు. దీంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. అలిగి సమావేశ కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయారు. అయితే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెంటనే వెళ్లి వేమిరెడ్డికి క్షమాపణలు చెప్పారు. కానీ ఎంపీ వేమిరెడ్డి సమావేశానికి హాజరుకాకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సీరియస్ అయ్యారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకూడదంటూ కలెక్టర్‌‌ను ఆదేశించారు. సమావేశంలో అందరి తరపున సభాముఖంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి(Minister Anam Ramanarayana Reddy) క్షమాపణలు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed