- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pawan Kalyan: వారాహి ఏది.. ఎక్కడ.. ఆ సినిమా ఆపారా? అంటూ అంబటి సెటైర్స్
దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టబోయే వారాహియాత్రపై అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. వారాహి ఏది.. ఎక్కడ.. ఆ సినిమా ఆపారా అంటూ మంత్రి అంబటి ప్రశ్నించారు. పవన్ కల్యాణ్, లోకేశ్‌కు నిబద్ధత లేదని, రాజకీయాలపై కనీస అవగాహన లేని వ్యక్తులని విమర్శించారు. యువగళం పాదయాత్రలో లోకేశ్ వ్యాఖ్యలపై విమర్శలు చేశారు. తెలుగు వాడుక భాషను లోకేశ్ మాట్లాడటం లేదని ఎద్దేవా చేశారు. తెలుగు కూడా మాట్లాడలేని వారు టీడీపీ వారసులా అని నిలదీశారు. ఇదేనా రాష్ట్రానికి చంద్రబాబు చెప్పిన ఖర్మ అని విమర్శించారు. లోకేశ్ పాదయాత్రతో టీడీపీ మరింత పతనం అవుతుందే తప్ప లబ్ధిపొందడం అనేది కల్ల అని ధ్వజమెత్తారు. ఈ విషయంలో అచ్చెన్నాయుడు సైతం తలపట్టుకుంటున్నారని అంబటి రాంబాబు విమర్శించారు.
వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నాం
ఇక మూడు రాజధానులపై ఆయన మాట్లాడుతూ వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నామని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. సమతౌల్యత కోసమే మూడు రాజధానులు అని పేర్కొన్నారు. విజయవాడలో భూగర్భ జలవనరుల డేటా సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి అంబటి రాంబాబు అనంతరం మీడియాతో మాట్లాడారు. మూడు రాజధానులతోనే పరిపాలన వికేంద్రీకరణ సాధ్యమని తెలిపారు.
Read more: