- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి అంబటికి బిగ్ షాక్.. సొంత నేతలే కంప్లైంట్
దిశ, వెబ్ డెస్క్: మంత్రి అంబటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు రెండో సారి విస్తరణలో భాగంగా మంత్రి అయ్యారు. అయితే నియోజకవర్గంలో ఆయనపై వ్యతిరేకత భారీగా పెరిగింది. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి అంబటిని వేరే నియోజవర్గానికి మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. అలా చేయకపోతే వచ్చే ఎన్నికల్లో 25 వేలకు పైగా ఓట్ల తేడాతో అంబటి ఓడిపోతారని చెబుతున్నారు. ఈ విషయాన్ని నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈసారి మంత్రి అంబటికి టికెట్ రాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు తీరు వల్ల వైసీపీ పరిస్థితి దారుణంగా ఉందని అనిల్ కుమార్ యాదవ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.