- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఆంబోతు’ విమర్శలపై అంబటి ఫైర్.. చంద్రబాబుకు స్ట్రాంగ్ వార్నింగ్
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆంబోతు.. ఆంబోతు..’ అంటూ తనను విమర్శించడంపై ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు పెద్ద చీటర్ 420 అని విమర్శించారు. తనపై విమర్శలు చేసే సమయంలో నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. లేదంటే చంద్రబాబు చరిత్ర అంతా ప్రజల ముందు ఉంచుతానని వార్నింగ్ ఇచ్చారు. మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఎవరని ప్రశ్నించారు. కోడెల మరణానికి చంద్రబాబునే కారణమని ఆరోపించారు. చంద్రబాబు చెత్తగా రాష్ట్రాన్ని పాలించాడని, అందుకే ఆయనకు 23 సీట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీ నావ పూర్తిగా మునిగిపోతుందని జోస్యం చెప్పారు. మునిగిపోయే నావను కాపాడుకునేందుకు చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని అంబటి వ్యాఖ్యానించారు. పల్నాడులో ఏడుగురు టీడీపీ అభ్యర్థులను ఓడించిన సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు. తన ఎమ్మెల్యేలను ఓడించే దమ్ము చంద్రబాబుకు లేదని మంత్రి అంబటి తేల్చి చెప్పారు.