- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చంద్రబాబు కోసమే పుట్టాడు.. పవన్‌పై Ambati హాట్ కామెంట్స్
దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును మంత్రి అంబటి రాంబాబు ఓ మ్యానిపులేటర్‌గా అభివర్ణించారు. మ్యానిపులేటర్ అయిన చంద్రబాబు వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో దిట్ట అని ఆయన ఆరోపించారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించిన అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందన్నారు. రాష్ట్రాన్ని పునర్ నిర్మాణం చేస్తానని చంద్రబాబు పదేపదే చెప్తున్నారని అది వాస్తవం కాదన్నారు. ఈసారి అధికారంలోకి వస్తే చంద్రబాబు ఆస్తులను, కొడుకును పునర్ నిర్మిస్తాడని సెటైర్లు వేశారు. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలో జరిగిన తప్పిదాలన్నిటికీ చంద్రబాబు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు కోసమే పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పైనా మంత్రి అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. ‘పవన్ కల్యాణ్ చంద్రబాబు కోసం పుట్టాడు. చంద్రబాబు కోసం పని చేస్తున్నాడు, పనిచేస్తాడు. చంద్రబాబు మాయలో పడ్డ పవన్ కల్యాణ్‌ను ఆ దేవుడే రక్షించాలి. ఓటు చీలకుండా చేస్తామని పవన్ చెప్పడం ఇదేమీ కొత్తేం కాదు. గతంలో కూడా చెప్పారు. ప్రజలు ఎలాంటి తీర్పునిచ్చారో దేశమంతా చూసింది.’ అని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
టికెట్లు రావనుకున్నోళ్లే ద్రోహం చేశారు
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపైనా అంబటి రాంబాబు మరోసారి స్పందించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్లు రావని నిర్ధారించుకున్న ఎమ్మెల్యేలు మాత్రమే టీడీపీకి ఓటేశారన్నారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలు ముందే టీడీపీతో బేరం మాట్లాడుకుని ఆ తర్వాత ఓటేశారన్నారు. వైసీపీ నుంచి గెలుపొంది టీడీపీకి అనుకూలంగా ఓటేసిన నలుగురు ఎమ్మెల్యేలపై ప్రభుత్వం వేటు వేసిందన్నారు. వైసీపీకి ద్రోహం చేసిన ఎమ్మెల్యేలు తిరిగి మీడియా ముందు ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో కూడా నోటుకి ఓటు లాంటిదేనని చెప్పుకొచ్చారు. ఎవరు ఓటేశారో నిరూపించలేక పోవచ్చు కానీ టీడీపీ కొనుగోలు చేసిందనేది స్పష్టంగా తెలుస్తుందని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు.