- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్‌పై మంత్రి అమర్‌నాథ్ ఘాటు వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ అజ్ఞాత వాసి అని, ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నాదెండ్ల మనోహర్ అజ్ఞాని అని మంత్రి అమర్‌నాథ్ ఎద్దేవా చేశారు. విశాఖలో మీడియాతో ఆయన మాట్టాడారు. రాష్ట్రాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి హోల్ సేల్‌గా అమ్మడం మొదలు పెట్టారని జనసేన నేత నాదెండ్ మనోహర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. నాదెండ్ల మనోహర్ పొలిటికల్ బ్రోకర్ అంటూ విమర్శించారు. ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సెల్ఫ్ సర్టిఫైడ్ మేధావి చేసే తప్పుడు వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని చెప్పారు. హిందూపురం అపెరల్ పార్క్, నెల్లూరు పవర్ ప్రాజెక్టు భూములు వివాదంలో ఉంటే జగన్ ప్రభుత్వం పరిష్కరించిందని తెలిపారు. ఏపీఐఐసీకి చెందిన 12 వేల ఎకరాల భూములు ఇప్పటికీ న్యాయ వివాదాల్లో ఉన్నాయని పేర్కొన్నారు. మరో 30 రోజుల్లో రామాయపట్నం పోర్టుకు తొలి వేసల్ రాబోతోందని చెప్పారు. నాదెండ్ల మనోహర్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్రం చేస్తున్నారని మంత్రి అమర్ నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.