- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Minister Achenna: అలా చేసి చికెన్, ఎగ్స్ తినండి.. మంత్రి అచ్చెన్న కీలక ప్రకటన

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ (Andhra Pradesh)లో బర్డ్ ఫ్లూ వైరస్ (Bird Flu Virus) చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో రోజురోజుకు వైరస్ విస్తృతంగా పాకుతోంది. తొలుత తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) కానూరు (Kanur)లో కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్ సోకినట్లుగా అధికారులు ఇప్పటికే నిర్ధారించారు. ఇప్పటి వరకు ఉభయ గోదావరి జిల్లాల్లో 50 లక్షలకు పైగా కోళ్లు మృతి చెందాయి. సోషల్ మీడియా (Social Media)లో ప్రచారం, అధికారుల వరుస హెచ్చరికలతో రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. నిన్న, మొన్నటి వరకు కస్టమర్లతో కళకళలాడిన చికెన్ సెంటర్లు (Chicken Centers) వెలవెలబోతున్నాయి. ఎవరూ చికెన్ కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు.
ఈ క్రమంలోనే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Minister Achennaidu) బర్డ్ ఫ్లూ వైరస్ (Bird Flu Virus)పై కీలక ప్రకటక చేశారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. ఉడికించిన చికెన్ (Chicken), గుడ్లు (Eggs) తినడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని అన్నారు. బర్డ్ ఫ్లూపై సోషల్ మీడియా (Social Media)లో కొన్ని పత్రికలు ప్రజల్లో లేని పోని భయాలను సృష్టిస్తున్నాయని అలాంటి పత్రికలపై చర్యల తీసుకుంటామని తెలిపారు. కేంద్రం ప్రభుత్వం (Central Government)తో పాటు శాస్త్రవేత్తల (Scientists)తో బర్డ్ ఫ్లూ వైరస్‌పై చర్చించామని, కొళ్లకు వ్యాధి సోకిన ప్రాంతానికి ఒక కిలో మీటర్ పరిధికే ఆ వైరస్ పరిమితం అవుతుందని వారు చెప్పినట్లుగా మంత్రి అచ్చెన్నాయుడు మీడియాకు వివరించారు.