- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దళితులను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు.. మేరుగు నాగార్జున
దిశ వెబ్ డెస్క్: వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహా నిర్మాణానికి రూపకల్పన చేసిన విషయం అందరికి సుపరిచితమే. కాగా ఆ విగ్రహ నిర్మాణం వైఎస్ జగన్ నేతృత్వంలో పూర్తయింది. ఈ నేపథ్యంలో రేపు విజయవాడలో అంబేద్కర్ విగ్రహా విష్కరణ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. విజయవాడలో రేపు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా జరుగుతుంది పేర్కొన్నారు. కాగా ఈ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి ప్రతి ఒక్కరు హాజరు కావాల్సిందిగా కోరారు. అంబేద్కర్ ఆశయాలను, ఆదర్శనాలను ముందుకు తీసుకు వెళ్తూ ఆయన భావజాలం ఈ సమాజానికి ఉపయోగపడేలా చేయాలనేది తమ ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన హయాంలో అంబేద్కర్ విగ్రహాన్ని పెడతానని మోసం చేశారు అని విమర్శించారు. మహనీయుడైన అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడో ముళ్ల పొదల్లో పెట్టడానికి చంద్రబాబు ప్రయత్నం చేశారు అని ఆయన మండిపడ్డారు. అంతేకాదు దళితులను చిన్న చూపు చూసి అవమానించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ మాట పైన నిలబడే వ్యక్తి అని.. జగన్ ఇచ్చిన హామీ ప్రకారం 400 కోట్ల రూపాయలకు పైగా నిధులతో భారతదేశం గర్వ పడేలా అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున పెట్టి ఇచ్చిన మాట నిలుపుకున్నారని జగన్ పై ప్రశంసల జల్లు కురిపించారు.