Rain Effect: విజయవాడ డివిజన్‌లో 20 రైళ్లు రద్దు

by srinivas |   ( Updated:2024-08-31 14:20:41.0  )
Rain Effect: విజయవాడ డివిజన్‌లో 20 రైళ్లు రద్దు
X

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌‌తో రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే రెండు రోజులుగా కురిసిన వర్షం చాలా ప్రాంతాల్లో బీభత్స సృష్టించింది. ఎడతెరిపి లేకుండా కురవడంతో వాగులు, వంకలు, పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు నీటితో మునిగిపోయాయి. పలు ప్రాంతాల్లో బస్టాండుల్లో నీరు చేరింది. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టడంతో రోడ్లపై మోకాళ్లోతు నీళ్లు నిలిచిపోయాయి. దీంతో వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.


మరో 24 గంటలు పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. విజయవాడ డివిజన్ పరిధిలో 20 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. భీమవరం-విజయవాడ-గూడూరు మధ్య రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేసింది. అంతేకాదు ఈ రైళ్లకు సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్లను సైతం ఏర్పాటు చేసింది. రద్దైన రైళ్ల వివరాలు తెలుసుకునేందుకు విజయవాడ హెల్ప్ లైన్ నెంబర్ 7569305697కు సంప్రదించాలని సూచించింది. ఇందుకు అనుగుణంగా ప్రయాణాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed