- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేం ఓటెయ్యం..అభ్యర్థి మొహం మీదే చెప్పిన మహిళ
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న రిజల్ట్స్ విడుదల కానున్నాయి. దీంతో అన్ని పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తు్న్నారు. అయితే మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యకు మాత్రం నిరసన సెగ తగిలింది. తమకు ఓటు వేయాలని ఓ కాలనీలో మహిళను లావణ్య కోరారు. దీంతో ఆమె ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మాకు జగన్ ప్రభుత్వం ఏమీ చేయలేదు, మేం వైసీపీకి ఓటు వేయం. ఎవరు అభివృద్ధి చేస్తే వారికే ఓటు వేస్తాం.’ అని లావణ్య మొహం మీదే చెప్పింది. అంతేకాదు వైసీపీ మేనిఫెస్టోను కూడా ఆమె తీసుకోలేదు. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న లావణ్య.. ఈసారి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కచ్చితంగా పథకాలు అందజేస్తామని చెప్పి లావణ్య అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కాగా గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ తరపున నారా లోకేశ్ పోటీ చేస్తుండగా, వైసీపీ నుంచి మురుగుడు లావణ్య బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో నారా లోకేశ్ ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వరుసగా వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచారు. దీంతో ఆయనపై వ్యతిరేకత వ్యక్తమైనట్లు సర్వేల్లో తేలడంతో మురుగుడు లావణ్యను ఈసారి అవకాశం ఇచ్చారు. దీంతో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.