- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాంగ్రెస్‌లో చేరే మొదటి ఎమ్మెల్యేను నేనే: RK సంచలన ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: షర్మిల చేరిక తర్వాతే తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతానని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరే మొదటి ఎమ్మెల్యేలను తానేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్‌లో వైఎస్ షర్మిలతో కలిసి పని చేస్తానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో పోటీపై షర్మిల, కాంగ్రెస్ సూచనల మేరకు నడుచుకుంటానని తేల్చి చెప్పారు. కాగా, వైసీపీలో సరైన ప్రాధాన్యత దక్కడం లేదంటూ తీవ్ర అసంతృప్తికి గురైన ఆర్కే.. ఇటీవల వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ తమ్మినేని సీతారాంకు రాజీనామా లేఖ పంపగా.. ప్రస్తుతం ఆయన వద్ద రిజైన్ లెటర్ పెండింగ్‌లో ఉంది. వైఎస్ ఫ్యామిలీకి విధేయుడైన ఆర్కే.. వైసీపీకి రాజీనామా చేసినప్పటికీ.. వైఎస్ఆర్ కూతురు షర్మిలతో కలిసి పని చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.