Nara Bhuvaneswari: ప్రజల పక్షాన లోకేశ్ పోరాటం.

by Seetharam |   ( Updated:2023-08-30 10:49:33.0  )
Nara Bhuvaneswari:  ప్రజల పక్షాన లోకేశ్ పోరాటం.
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువగళం రధసారథి నారా లోకేశ్‌పై ఆయన తల్లి నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని ప్రజల కోసం నారా లోకేశ్ పోరాడుతున్నాడని స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కాశిపెంట్ల సమీపంలో గోకుల్‌ హెరిటేజ్‌ రెండో పార్లర్‌ను భువనేశ్వరి బుధవారం ప్రారంభించారు. పార్లర్‌లోని వస్తువులను కొనుగోలు చేసి ఉద్యోగులు, అక్కడికి వచ్చిన గ్రామస్తులకు పంచిపెట్టారు. అనంతరం భువనేశ్వరి మీడియాతో మాట్లాడారు. ప్రజలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను అందించడమే తమ సంస్థ యెుక్క ముఖ్య ఉద్దేశం అని భువనేశ్వరి తెలిపారు. లోకేశ్‌ ప్రజల కోసం పోరాడుతున్నాడని చెప్పుకొచ్చారు.‘యువగళం’ పాదయాత్ర గురువారం 200వ రోజుకు చేరుతుందని చెప్పుకొచ్చారు. ఆ రోజు కుటుంబ సభ్యుల్లోని కొంతమంది వెళ్లి యువగళం పాదయాత్రలో పాల్గొంటామని తెలిపారు. ప్రజల కోసం పోరాటం చేస్తున్న లోకేశ్‌కు భగవంతుడు అన్ని శక్తులూ ఇవ్వాలని భువనేశ్వరి ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ప్రజలంతా తమ హక్కుల కోసం పోరాడాలని భువనేశ్వరి పిలుపునిచ్చారు.

Advertisement

Next Story