‘హాస్యగళం’విని, చూసి........ నవ్వుకోండి !: యువగళంపై మంత్రి అంబటి సెటైర్లు

by Seetharam |   ( Updated:2023-11-27 06:22:23.0  )
‘హాస్యగళం’విని, చూసి........ నవ్వుకోండి !: యువగళంపై మంత్రి అంబటి సెటైర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం మలివిడత పాదయాత్ర ప్రారంభమైంది. స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన నేపథ్యంలో సెప్టెంబర్ 9న నారా లోకేశ్ యువగళం పాదయాత్రను ఆపివేశారు. అనంతరం చంద్రబాబు బెయిల్ ఇతర వ్యవహారాల నిమిత్తం పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. అనంతరం చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరుకావడంతో ఇక లోకేశ్ యువగళం పాదయాత్రను పున: ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచి మలివిడత పాదయాత్ర పున: ప్రారంభమైంది. లోకేశ్ యువగళం పాదయాత్ర పున: ప్రారంభం సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ఎక్స్ వేదికగా మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.‘ప్రారంభమయిన ‘‘హాస్యగళం’’విని, చూసి........ నవ్వుకోండి !’ అని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఇకపోతే సోమవారం ఉదయం ప్రారంభమైన యువగళం పాదయాత్ర రాజోలు నియోజకవర్గం నుంచి పి.గన్నవరం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. తాటిపాక సెంటర్‌లో బహిరంగ సభలో లోకేశ్ ప్రసంగిస్తారు. అనంతరం పి.గన్నవరం నియోజకవర్గంలోకి లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రవేశిస్తుంది. నగరంలో గెయిల్, ఓఎన్జీసీ బాధితులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం మామిడికుదురులో స్థానికులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 2.45 – పాశర్లపూడిలో భోజన విరామం తీసుకుంటారు. సాయంత్రం 5.30 గంటలకు అమలాపురం నియోజకవర్గంలోకి లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభమవుతుంది. సాయంత్రం 6.30 – బోడసకుర్రులో మత్స్యకారులతో లోకేశ్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 7.30గంటలకు పేరూరులో రజక సామాజికవర్గీయులతో భేటీ అవుతారు. సా.7.45 – పేరూరు శివారు విడిది కేంద్రంలో నారా లోకేశ్ బస చేస్తారు.

Advertisement

Next Story

Most Viewed