ఏపీలో ముగిసిన మద్యం లాటరీ ప్రక్రియ

by Mahesh |   ( Updated:2024-10-14 12:13:18.0  )
ఏపీలో ముగిసిన మద్యం లాటరీ ప్రక్రియ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం(Andhra Pradesh State Govt) ఇటీవల తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీ(New Liquor Policy)కి అనుగుణంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. 26 జిల్లాల పరిధిలో

మొత్తం 3,396 మద్యం దుకాణాలకు రాష్ట్రవ్యాప్తంగా 89,882 దరఖాస్తులు వచ్చాయి. కాగా ఈ దరకాస్తులకు సంబంధించిన లాటరీ విధానాన్ని సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం అయింది. కాగా పూర్తి బందోబస్తు నడుమ నిర్వహించిన ఈ లాటరీ కొన్ని ప్రాంతాల్లో జాతరను తలపించింది. ఉదయం నుంచి నిరాటంకంగా జరిగి లాటరీ విధానం మధ్యాహ్నం 3 గంటల వరకు పూర్తి అయింది. కాగా డ్రాలో మద్యం షాప్ లైసెన్స్ (దుకాణం) దక్కించుకున్న వ్యాపారులు.. 24 గంటల్లో లైసెన్స్ ఫీజు చెల్లించాలనే నిబంధన విధించారు. దీంతో డ్రాలో షాపులు వచ్చిన వారు ప్రస్తుతం నగదు సమీకరణ పనిలో పడ్డారు. గత ప్రభుత్వం పాత మద్యం పాలసీని రద్దు చేసి కొత్త పాలసీ(Private policy)నీ తీసుకొచ్చింది. కాగా ఈ రోజు లక్కీ డ్రాలో షాప్ లు వచ్చిన వారు. 16 నుంచి కొత్త షాప్ లో అమ్మకాలు జరుపుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ కొత్త మద్యం పాలసీ కారణంగా ప్రభుత్వానికి.. నాన్ రిఫండబుల్ రుసుముల రూపంలో రూ.1,797.64 కోట్ల మేర ఆదాయం సమకూరింది.

Read More : ఎల్లుండి నుంచి కొత్త మద్యం షాపులు ప్రారంభించుకోవచ్చు: Kollu Ravindra

Advertisement

Next Story

Most Viewed