- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గిరిజనుల్లో బీఆర్ఎస్‌పై ఉన్న అపోహలు తొలగిద్దాం : మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
దిశ, తెలంగాణ బ్యూరో : గిరిజనుల్లో బీఆర్ఎస్‌పై ఉన్న అనుమానాలను తొలగిద్దామని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బీఆర్ఎస్‌కు మద్దతు కూడగట్టేలా ప్రయత్నం చేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ హద్దుల్లేని హామీలు ఇచ్చిందని ఆరోపించారు. అవి నెరవేర్చకపోతే ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తామని స్పష్ఠం చేశారు. ప్రజలు అడిగిన, అడగని పథకాలు కూడా తాము అమలు చేశామని గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ లో గులాబీ జెండా ఎగురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలం అవుతోందని విమర్శించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతోందని అన్నారు. కార్యకర్తల్లోని ఉత్సాహం చూస్తుంటే బీఆర్ఎస్ ఓడిపోలేదని అనిపిస్తోందని పేర్కొన్నారు. దళిత బంధుపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నాయకులమంతా కలిసికట్టుగా నిలదీద్దామని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమిని మరచిపోయి పార్లమెంటు ఎన్నికల్లో సమిష్టిగా పని చేసి గెలుద్దామని అన్నారు. ఈ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, మాజీ ఎమ్మెల్యే పెద్దిసుదర్శన్ రెడ్డి, తదితరులు మాట్లాడారు.