రేపు జగనాసుర దహనం చేద్దాం...విజయదశమికి వినూత్న నిరసనకు లోకేశ్ పిలుపు

by Seetharam |
రేపు జగనాసుర దహనం చేద్దాం...విజయదశమికి వినూత్న నిరసనకు లోకేశ్ పిలుపు
X

దిశ, డైనమిక్ బ్యూరో : దసరా వేడుకలు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జగన్మాత కనకదుర్గమ్మ రోజుకోక అవతారంలో తొమ్మిది రోజులపాటు భక్తులకు దర్శనం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే విజయదశమి రోజున చెడుకు చిహ్నంగా రావణుడి దిష్టిబొమ్మను దహనం చేస్తారు.చెడుపై మంచి విజయం సాధించినందుకు విజయదశమి పండుగ రోజున రావణాసురుడి దిష్టబొమ్మను దహనం చేస్తారన్న విషయం తెలిసిందే. అయితే ఈ విజయ దశమి పండుగను సైకో జగన్ అనే చెడుపై మంచి అనే చంద్రబాబు సాధించబోయే విజయంగా నిర్వహించుకోవాలని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ప్రజలకు పిలుపునిచ్చారు. విజయదశమి రోజున వినూత్నంగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. దసరాకు దేశం మొత్తం రావణాసుర దహనం చేస్తుందని చెబుతూ మనం మాత్రం జగనాసుర దహనం చేద్దామని ట్వీట్ చేశారు. అక్టోబర్ 23న విజయ దశమి పర్వదినం సందర్భంగా రాత్రి 7 గంటలకు 5 నిమిషాల పాటు వీధుల్లోకి రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘సైకో పోవాలి’ అని రాసి ఉన్న పత్రాలను దహనం చేయాలని లోకేశ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయాలని ప్రజలకు నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు. ‘దేశం చేస్తోంది రావ‌ణాసుర ద‌హ‌నం-మ‌నం చేద్దాం జ‌గ‌నాసుర ద‌హ‌నం. అరాచ‌క, విధ్వంస‌క పాల‌న సాగిస్తున్న సైకో జ‌గ‌నాసురుడి పీడ పోవాల‌ని నిన‌దిద్దాం. అక్టోబ‌ర్ 23 విజ‌య‌ద‌శ‌మి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా రాత్రి 7 గంట‌ల నుంచి 7.05 నిమిషాల మ‌ధ్య‌లో వీధుల్లోకి వ‌చ్చి‘సైకో పోవాలి’అని రాసి ఉన్న ప‌త్రాల‌ను ద‌హ‌నం చేయండి. ఆ వీడియో, ఫోటోల‌ను సోషల్ మీడియాలో షేర్ చేయాలి’అని నారా లోకేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story