అరుదైన గుర్తింపు: జాతీయస్థాయిలో సత్తా చాటిన లేపాక్షి

by Seetharam |
అరుదైన గుర్తింపు: జాతీయస్థాయిలో సత్తా చాటిన లేపాక్షి
X

దిశ, డైనమిక్ బ్యూరో : శ్రీ సత్యసాయి జిల్లాలోని ప్రసిద్ధ శిల్పకళాక్షేత్రం లేపాక్షికి అరుదైన గుర్తింపు దక్కింది. ఉత్తమ జాతీయ పర్యాటక గ్రామంగా లేపాక్షి ఎంపికైంది. ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ పర్యాటక శాఖ నుంచి లేపాక్షి సర్పంచ్‌ ఆదినారాయణ ఈ మేరకు అవార్డును అందుకున్నారు. లేపాక్షికి జాతీయ స్థాయి గుర్తింపు రావడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ లేపాక్షి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటామని సర్పంచ్ ఆదినారాయణ వెల్లడించారు. ఇప్పటికే లేపాక్షిగ్రామం పర్యాటకంగా ఎంతో గుర్తింపు లభించిందని..ఈ ప్రాంత ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసేలా అన్ని సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. జాతీయ పర్యాటక శాఖ గుర్తించి లేపాక్షి గ్రామానికి ఈ గుర్తింపు ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉందని ఈ మేరకు జాతీయ పర్యాటక శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

Next Story