- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
వైసీపీకి షాక్.. కీలక నేత రాజీనామా
దిశ, ఏపీ బ్యూరో: నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలో వైసీపీలో అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కీలక నేత కాటసాని రమాకాంత్‌రెడ్డి వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఫేస్‌బుక్ వేదికగా స్పష్టం చేశారు. గుడై బై వైఎస్ఆర్‌సీపీ.!!! సారీ సీఎం వైఎస్ జగన్ అంటూ ఫేస్‌బుక్ పేజీలో తన రాజీనామా నిర్ణయాన్ని కాటసాని రమాకాంత్‌రెడ్డి ప్రకటించారు. అనంతరం ఓ వీడియో విడుదల చేశారు. వైసీపీ ఆవిర్భావం నుంచి తాను పార్టీలో కొనసాగుతున్నట్లు వెల్లడించారు. అయితే పార్టీలో తగిన గుర్తింపు లేకపోవడంతో తాను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
భవిష్యత్‌లో ఏపార్టీలో చేరాలి అనేది త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు. సాధారణంగా అన్ని చోట్ల ప్రతిపక్షం నుంచి అధికార పార్టీలోకి నాయకులు వలస వస్తారని కానీ రాష్ట్రంలో విచిత్ర పరిస్థితి నెలకొందని.. అధికార పార్టీ నుంచి ఇతర పార్టీలకు వెళ్తున్న పరిస్థితులు నెలకొన్నాయని వెల్లడించారు. నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తలు చాలా మంది అసంతృప్తితో ఉన్నారని.. ఇప్పటికే పలువురు వేర్వేరు పార్టీలలోకి వెళ్లిపోయారని గుర్తు చేశారు. అసంతృప్తులందరితో భేటీ అయ్యి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని కాటసాని రమాకాంత్ రెడ్డి తెలిపారు. ఇకపోతే రమాకాంత్ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సోదరుడి కుమారుడు. ప్రస్తుతం అవుకు మండలం పరిధిలోని గుండ్ల సింగవరం గ్రామ సర్పంచ్‌గా ఉన్నారు. ఇప్పటివరకు కాటసాని కుటుంబం మొత్తం వైసీపీలో ఉంది. అయితే ఆ కుటుంబం నుంచి కాటసాని రమాకాంత్ రెడ్డి బయటకు రావడం రాజకీయంగా సంచలనంగా మారింది.