బ్రేకింగ్: ఆంధ్రప్రదేశ్‌లో నిలిచిపోయిన భూ రిజిస్ట్రేషన్లు!

by Satheesh |   ( Updated:2023-05-29 12:30:25.0  )
బ్రేకింగ్: ఆంధ్రప్రదేశ్‌లో నిలిచిపోయిన భూ రిజిస్ట్రేషన్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా భూ రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. సాంకేతిక లోపం కారణంగా ఇవాళ (సోమవారం) ఉదయం నుండి ల్యాండ్ రిజిస్ట్రేషన్లు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 295 రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఇదే పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. ల్యాండ్ రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో ఉదయం నుండి వేచి చూస్తోన్న జనం ఓపిక నశించి పలుచోట్ల కార్యాలయ సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు.

అయితే, ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 1వ తేదీ నుండి ల్యాండ్ రేట్లు పెరుగుతాయనే వార్తల నేపథ్యంలో జనాలు ఒక్కసారిగా రిజిస్ట్రేషన్ ఆఫీస్‌ల బాటపట్టారు. సోమవారం దాదాపు అన్ని రిజిస్ట్రేషన్ ఆఫీసులు జనంతో కిక్కిరిసిపోయాయి. జనం ఒక్కసారిగా రావడంతో సైట్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో ఉదయం నుండి రిజిస్ట్రేషన్ ఆఫీస్‌ల వద్ద జనం పడిగాపులు గాస్తున్నారు.

Advertisement

Next Story