- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గిరిజన మహిళ భూమిపై కన్నేసిన పెత్తందారులు.. పట్టించుకోని అధికారులు
దిశ, కావలి: నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు పంచాయతీ పరిధిలోని తిమ్మారెడ్డి పాలెం గ్రామంలో ప్రభుత్వ భూమి ఉంది. అదే గ్రామానికి చెందిన ఒక గిరిజన మహిళ యాకసిరి సుచిత్ర గత కొన్నేళ్లుగా ఆ భూమిలో కొంత భూమిని సాగు చేసుకుని జీవనం సాగిస్తోంది. ఐతే అదే గ్రామంలో ఉండే కొందరు కాపులు ఆ భూమిపై కన్నేసి భూమిని కాళీ చేయమని బెదిరిస్తున్నారంటూ, భూమిలో వేసుకున్న మొక్కలను సైతం రాత్రికి రాత్రే పీకేసి ఘోరానికి పాల్పడ్డారని బాధిత మహిళ కావలిలోని స్థానిక ప్రెస్ క్లబ్‌లో మీడియా ముందు వాపోయింది.
భూమికి సంబంధించి సంభందిత అధికారులకు సమాచారం తెలిపిన కూడా రెవెన్యూ శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదని తెలిపింది. అంతేకాకుండా రూపాయిలకు అమ్ముడు పోయిన అధికారులు గిరిజనులు రెడ్లు పొలం దగ్గర ఉండడానికి కుదరదు అంటూ బెదిరిస్తున్నారని గిరిజన బాధిత మహిళ యాకసిరి సుచిత్ర తమ పిల్లలతో మీడియా ఎదుట కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దళిత మహిళనైనా నాకు న్యాయం చేయాలని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.
- Tags
- tribal women
- land