అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకోవాలి: TG Bharat

by srinivas |
అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకోవాలి: TG Bharat
X

దిశ, కర్నూలు ప్రతినిధి: కర్నూలును అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకోవాలని ప్రజలకు కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ సూచించారు. కర్నూలు 14వ వార్డు పరిధి బుధవారపేటలో బాబు షూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోను టిజి భరత్ ప్రజలకు చదివి వినిపించారు. ప్రజలకు మంచి సంక్షేమం అందించేందుకు చంద్రబాబు పథకాలను రూపొందించారని చెప్పారు. చంద్రబాబు సంతకం పెట్టి షూరిటీ ఇచ్చిన బాండ్ పేపర్లను ప్రజలకు అందిస్తున్నట్లు వివరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాలన్నీ అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామని టీజీ భరత్ తెలిపారు. తనకు ఎమ్మెల్యేగా ఒక అవకాశం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. తాను ఎమ్మెల్యే అయ్యాక బుధవారపేటలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన చెప్పారు. ప్రజలకు మంచి చేసే నాయకుడిని ఎన్నుకోవాలని తాను కోరుతున్నట్లు టిజి భరత్ తెలిపారు.

Advertisement

Next Story